పొగత్రాగుట వలన కొన్ని తప్పుడు భావాలు

- August 28, 2015 , by Maagulf
పొగత్రాగుట వలన కొన్ని తప్పుడు భావాలు

మీరు ధూమపానం చేస్తుంటారా? అవును అని మీ సమాధానం అయితే, మిమ్మలిని ఆ పొగత్రాగటం మీ జీవితంలోని 10 సంవత్సరాల ఆయువును లాగేసు కుంటుందని తెలుసుకుని కూడా ఉండాలి. మీరు ఈ పది పుట్టినరోజులు చూడలేరు, చేసుకోలేరు. ధూమపానం విడిచిపెట్టటం కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. మీరు మీ సొంతంగా ధూమపానం వలన కలిగే దుష్ప్రభావాలను తెలుసుకుంటే,మీరు ఖచ్చితంగా ధూమపానాన్ని విడిచిపెట్టటానికి ప్రయత్నిస్తారు. ధూమపానం మానేయడానికి 10 సహాజ మార్గాలు మీరు ఏ వయస్సులో అయినా సరే, ధూమపానాన్ని విడిచిపెట్టాలనుకుంటే, అది మీ జీవితరేఖను పెంచుతుంది మరియు ధూమపానం వలన తీవ్రమైన వ్యాధుల ప్రమాదం నుండి తప్పించుకుంటారు. కాబట్టి, ఎప్పుడూ ఆలస్యం చేయవద్దు. మీరు ధూమపానం చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉండే వారిని కూడా పొగతో మీ కుటుంబ సభ్యుల జీవితాలను కూడా చాలా ప్రమాదంలోకి నెట్టుతున్నారని మీకు తెలుసా. వారు చురుకుగా పీల్చే నిష్క్రియాత్మక పొగ కంటే ఈ ధూమపానం వలన కలిగే హాని ఎక్కువ. పొగత్రాగటం హ్యాబిట్స్: అపోహలు-వాస్తవాలు..! మీరు మీ కుటుంబంతో ఆనందంగా మరియు సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటే, అప్పుడు మీ విలువైన ఊపిరితిత్తులలో ఈ విషపు పొగ పీల్చడం ఆపేయండి. ఇక్కడ ఈ వ్యాసంలో, మీరు ధూమపానం మానివేయనీయకుండ నిరోధిస్తున్న సాధారణ ఊహాగానాల గురించి చదువుకోవచ్చు. సిగరెట్లలో ఉన్న నికోటిన్ హానికరమైనదని అని ప్రజలందరూ చెపుతుంటారు. అయితే, నికోటిన్ మాత్రమే కాదు కానీ నికోటిన్ కంటే మరింత హానికరమైన ఇతర సమ్మేళనాలు వేలకొద్దీ సిగరెట్లలో ఉన్నాయి. ఈ పదార్ధాల వలన నూటికి యాభైమందిలో క్యాన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయి. సిగరెట్స్ మానేయడ వల్ల అనేక రకాల జబ్బులను నివారించుకోవచ్చు . కాబట్టి సిగరెట్స్ ను రెండుగా లేదా ముక్కలుగా కట్ చేయడం వల్ల కూడా సిగరెట్ త్రాగాలనే ఆలోచన తగ్గుతుందని కొన్ని పరిశోధనల ద్వారా తెలిసింది. స్మోకర్స్ హెల్తీ డైట్ ను అనుసరిస్తున్నట్లైతే కనుక హానికరమైన ఎఫెక్ట్స్ నుండి మీరు బయట పడవచ్చు . సిగరెట్స్ లో ఉండే కెమికల్స్ పర్మనెంట్ గా డ్యామేజ్ కలిగిస్తుంది . కాబట్టి హెల్తీ డైట్ తీసుకొన్నా కూడా ఏదో ఒక రకంగా ఆరోగ్యానికి హాని కలుగుతుంది కాబట్టి, సిగరెట్ త్రాగడం మానేయడం ఒక్కటే మార్గం. సిగరెట్ మానేయలేని వారికి ఒక రకంగా లైట్ ఆర్ ఎలక్ట్రిక్ సిగరెట్ కొంత వరకూ మేలు. ఈ లైట్ సిగరెట్ వల్ల ఆరోగ్యం మీద తక్కవ హాని ఉంటుంది . అయితే నార్మల్ సిగరెట్స్ కు అలవాటు పడినవారు లైట్ సిగెరెట్స్ తో సంత్రుప్తి పడరు. ధూమపానం వల్ల ఆరోగ్యానికి జరగాల్సిందల్లా జరిగిన తర్వాత ధూమపానం విడవడంతో ఎలాంటి ఉపయోగం ఉండదు . అయితే మీకు ఎప్పుడెప్పుడు త్రాగకూడదు అనిపిస్తుందో అప్పుడు స్మోక్ చేయకుండుట మంచిది . ఏ వయస్సులో అయినా సరే స్మోక్ వదిలేయడం వల్ల మరికొన్ని ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించగలరు . 30ఏళ్ళలో ధూమపానం నిలిపేయడం వల్ల 90శాతం హనికర వ్యాధులను నివారించుకోవచ్చు. ధూమపానం మానేయడం వల్ల హానికర వ్యాధులను నివారించడం మాత్రమే కాదు, మానసిక మరియు శారీరకన యాక్టివిటీస్ లో మరింత చురుకుగా ఉంటారు . తినే ఆహారం యొక్క రుచి మరింత బెటర్ గా తెలుస్తుంది. .

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com