ఎన్నారైలకు తప్పని కష్టాలు
- November 19, 2016వికాస్ దుబాయ్‌లో పది సంవత్సరాలుగా ఉద్యోగం చేసున్నాడు... ఇంట్లో వారికి నెలా ఖర్చుల కోసం కొంచం మొత్తాన్ని మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థ ద్వారా పంపాడు.. కుటుంబసభ్యుల డబ్బుల కోసం మనదేశంలోని ఆ సంస్థ బ్రాంచి కార్యాలయంలో సంప్రదించగా తమ దగ్గర డబ్బు లేదని కావాలంటే చెక్ ఇస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు.
ఇది కేవలం ఏ వికాస్ కుటుంబానికో కాదు విదేశాల్లోని లక్షలాది ఎన్నారైలు తమ కుటుంబసభ్యులకు డబ్బులు పంపిస్తున్నా అవి వారికి చేరడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ చలామణి తగ్గిపోవడంతో పాటు ట్రాన్స్‌ఫర్ సంస్థల వద్ద కొత్త కరెన్సీ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.
వాస్తవానికి ఎన్నారైలు మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థలో డబ్బులు జమచేసి వెంటనే తమ కుటుంబసభ్యులకు ఆ సమాచారం తెలిపితే క్షణాల్లో వారు వెళ్లి డబ్బులు తీసుకువచ్చేవారు. క్షణాల్లో జరిగే కరెన్సీ బట్వాడా గత పదిరోజులుగా జరగకపోవడంతో లక్షలాదిమంది ఎన్నారైల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రతినెలా పిల్లలకు స్కూలు ఫీజు, బట్టలు, మతపరమైన కార్యక్రమాలకు చిన్నమొత్తాలను పంపిస్తుంటారు. అయితే ఆ డబ్బులు కుటుంబసభ్యులకు చేరకపోవడంతో ఎన్నారైలు ఆదుర్దాతో వున్నారు.
ఇటు కుటుంబసభ్యులు చేతిలో డబ్బులు లేక పలు అవస్థలు పడుతున్నారు.
తాజా వార్తలు
- IIFA ఉత్సవం.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?