త్వరలో మిషన్ సోషల్ మీడియా చేపడతాం - కమిషనర్ మహేందర్ రెడ్డి
- November 19, 2016
మిషన్ చబుత్ర తరహాలో పాతబస్తీలో త్వరలో సోషల్ మీడియా మిషన్ చేపడతామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమయిన పోస్టింగ్‌లు పెట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టేవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సాలార్‌జంగ్ మ్యూజియంలో శనివారం ముస్లిం మతపెద్దలతో సౌత జోన్ పోలీసులు సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య వివాదాలు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ఫోస్టింగ్‌లు వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఏసీపీకి లేదా డీసీపీ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పేట్లబురుజు సీఏఆర్ అడిషనల్ కమిషనర్ శివప్రసాద్, దక్షిణమండల డీసీపీ వి.సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ బాబురావు, ముస్లిం మత పెద్దలు మౌలానా ముఫ్తిఖలీల్ అహ్మద్, మౌలానా సయ్యద్ అలీ హుసేని, అలీ ముస్తఫా ఖాద్రి, అహ్మద్ హుసైన్ ఖాద్రి, హైదర్ ఆగా, ముర్తుజా పాషా, ఖుబుల్ పాషా శతారి, హాఫిజ్ ముజఫర్ హుసేన్ బందనవాజీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







