సలాలాలో సుల్తాన్‌ కబూస్‌ యూత్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం

- November 22, 2016 , by Maagulf
సలాలాలో సుల్తాన్‌ కబూస్‌ యూత్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం

సలాలా: సుల్తాన్‌ కబూస్‌ బిన్‌ సైద్‌ సూచన మేరకు మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ మరియు దోఫార్‌ గర్నర్‌ సయ్యిద్‌ మొహమ్మద్‌ సుల్తాన్‌ అల్‌ బుసైది, సుల్తాన్‌ కబూస్‌ యూత్‌ కాంప్లెక్స్‌ ఫర్‌ కల్చర్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ప్రారంభించారు. 46వ జాతీయ దినోత్సవ వేడుకల సమయంలో ఈ కాంప్లెక్స్‌ ప్రారంభమవడం గమనించదగ్గది. యువత తమ విలువైన సమయాన్ని సరికొత్త ఆవిష్కరణల కోసం వినియోగించడంతోపాటు, కల్చరల్‌ యాక్టివిటీస్‌ని పెంపొందించుకోవడంపైనా, స్పోర్ట్స్‌ మరియు రిక్రియేషనల్‌ యాక్టివిటీస్‌ కోసం వినియోగించుకునేందుకు వీలుగా ఈ కాంప్లెక్స్‌ ఉపయోగపడ్తుందని దోఫార్‌ గవర్నర్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సల్తాన్‌ కబూస్‌ హయ్యర్‌ సెంటర్‌ ఫర్‌ కల్చర్‌ అండ్‌ సైన్స్‌ సెక్రెటరీ జనరల్‌ హబీబ్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ రియామి ప్రసంగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com