'మెగా' రగడ

- August 31, 2015 , by Maagulf
'మెగా' రగడ

మంచు వారి కుటుంబానికి - మెగా కుటుంబానికి మధ్య ఉన్న వార్ ఓపెన్ సీక్రెట్. అయితే బయట కలిసినప్పుడు మాత్రం ఈ రెండు కుటుంబాలు ఒకరి పై ఒకరు ప్రేమను వొలకపోస్తూ బాగా నటిస్తూ ఉంటారు. అనుకోకుండా మెగా కుటుంబ హీరో నటించిన సినిమా ఏది ఈ వారం విడుదల లేకపోయినా అనుకోకుండా ఈ వార్ మళ్ళీ ఈ రెండు కుటుంబాల మధ్య ఏర్పడటం సంచలనంగా మారింది. అయితే ఈసారి ఈవార్ కు మంచు కుటుంబం నుండి విష్ణు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే మెగా కుటుంబం నుండి అల్లుఅరవింద్ ఈమెగా వార్ కు కేంద్రబిందువుగా మారాడు. ఈవారం విడుదల అవుతున్న 'డైనమైట్', 'భలే భలే మగాడివోయ్' సినిమాల మధ్య జరుగుతున్న ధియేటర్ల వార్ మరో మెగా ఫైట్ ను తలపిస్తోంది అంటూ ఫిలింనగర్ లో కామెంట్స్ వినపడుతున్నాయి. నైజాం ప్రాంతంలో అధిక సంఖ్యలో ధియేటర్లు అల్లుఅరవింద్ దిల్ రాజ్ ల చేతిలో ఉండటంతో నాని 'భలే భలే మగాడివోయ్' సినిమాకు మంచి ధియేటర్లు దొరకడమే కాకుండా ధియేటర్ల సంఖ్యలో కూడ విష్ణు 'డైనమైట్' సినిమాకన్నా ముందులో ఉంది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో కూడ దిల్ రాజ్ హవా కొనసాగిస్తూ ఉండటంతో ఆ జిల్లాలో కూడ మంచు విష్ణు 'డైనమైట్' కు ఎదురు దెబ్బ తగిలింది అని టాక్. ఒకవైపు ఇరురాష్ట్రాలలోని చాలప్రాంతాలలో 'బాహుబలి', 'శ్రీమంతుడు' సినిమాలు మంచి ధియేటర్లలో రన్ అవుతున్న నేపధ్యంలో ఈరెండు చిన్న సినిమాలకు మధ్య ఏర్పడిన ధియేటర్ల వార్ మళ్ళీ మంచు మెగా ఫైట్ గా మారడం అనుకోకుండా జరిగినా మీడియాకు మాత్రం ఈ ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ రెండు సినిమాలలో నటిస్తున్న హీరోలు నాని, విష్ణులకు కెరియర్ పరంగా వరస పెట్టి పరాజయాలు వస్తున్న నేపధ్యంలో అనవసరంగా ఒకేరోజు వీరిద్దరూ వారివారి సినిమాలతో తల పడటం ఎంతవరకు మంచిది అన్న కామెంట్స్ ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com