వాతావరణ మార్పులు- దుబాయ్, దోహా లలో తుఫాను
- September 01, 2015
పర్యావరణంలోవస్తున్నమార్పుల వల్ల, అరేబియా గల్ఫ్ లో మొట్టమొదటి సారి తుఫానులు ఏర్పడి, దుబాయ్ , దోహా వంటి పట్టణాలు ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్తితులు తల ఎత్తవచ్చునని అమెరికా లో జరిగిన ఒక అధ్యయనం తెలియజేసింది. వేలాది కంప్యూటర్ల సాయంతో గణన చేసిన ప్రకారం, ఈ శతాబ్దంలో ఫ్లోరిడాలోని టాంపా, ఆస్ట్రేలేయా లోని కేరిన్స్ ప్రాంతాలు ఇప్పటికే తీవ్ర తుఫానుల నిలయంగా మారాయని, భూ తాపం పెరుగుదల వలన అరేబియన్ గల్ఫ్ యొక్క తేలికైన వెచ్చని జలాలు ఇప్పటివరకు ఏ తుఫానును నమోదు చేయనప్పటికీ, భవిష్యత్తులో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు అన్నారు. గతచరిత్రపై ఆధారపడి భవిష్యత్తును ఊహించలేమని, గల్ఫ్ ప్రాంతంలో తుఫానులు వచ్చే అవకాశం స్వల్పమే ఐనప్పటికీ, అణుశక్తి కేంద్రాన్ని నిర్మించాలనుకున్నపుడు మాత్రం, పై విషయాలను పరిగణింఛేతీరాలని, ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ రచయిత్రి- నింగ్ లిన్, మస్సచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కెర్రీ ఇమ్మాన్యుయెల్ తో కలిపి కనుగొన్న విషయాలను వివరించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







