వాతావరణ మార్పులు- దుబాయ్, దోహా లలో తుఫాను

- September 01, 2015 , by Maagulf
వాతావరణ మార్పులు- దుబాయ్, దోహా లలో తుఫాను

పర్యావరణంలోవస్తున్నమార్పుల వల్ల, అరేబియా గల్ఫ్ లో మొట్టమొదటి సారి తుఫానులు ఏర్పడి, దుబాయ్ , దోహా వంటి పట్టణాలు ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్తితులు తల ఎత్తవచ్చునని అమెరికా లో జరిగిన ఒక అధ్యయనం తెలియజేసింది. వేలాది కంప్యూటర్ల సాయంతో గణన చేసిన ప్రకారం, ఈ శతాబ్దంలో ఫ్లోరిడాలోని టాంపా, ఆస్ట్రేలేయా లోని కేరిన్స్ ప్రాంతాలు ఇప్పటికే తీవ్ర తుఫానుల నిలయంగా మారాయని, భూ తాపం పెరుగుదల వలన అరేబియన్ గల్ఫ్ యొక్క తేలికైన వెచ్చని జలాలు ఇప్పటివరకు ఏ తుఫానును నమోదు చేయనప్పటికీ, భవిష్యత్తులో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు అన్నారు. గతచరిత్రపై ఆధారపడి భవిష్యత్తును ఊహించలేమని, గల్ఫ్ ప్రాంతంలో తుఫానులు వచ్చే అవకాశం స్వల్పమే ఐనప్పటికీ, అణుశక్తి కేంద్రాన్ని నిర్మించాలనుకున్నపుడు మాత్రం, పై విషయాలను పరిగణింఛేతీరాలని, ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ రచయిత్రి- నింగ్ లిన్, మస్సచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కెర్రీ ఇమ్మాన్యుయెల్ తో కలిపి కనుగొన్న విషయాలను వివరించారు. 

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com