"బి డి ఎఫ్" ను ప్రశంసించిన బహ్రైన్ అధినేత

- September 01, 2015 , by Maagulf

బహ్రైన్ అధినేత  హిజ్ మాజెస్టీ కింగ్ హమాద్,  బహ్రైన్ డిఫెన్స్ ఫోర్స్ (BDF) జనరల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించిన సందర్భంగా, ఆయనను BDF కమాండర్ ఇన్‌ఛార్జ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, డిఫెన్స్ మినిస్టర్ లేఫ్టనెంట్ జనరల్ యూసెఫ్ బిన్ అహ్మద్ అల్ జలహ్మా మరియు ఇతర ఉన్నతాధికారులు స్వాగతించారు. ఈ సందర్భంగా కింగ్ హమాద్, BDF ఆయుధాగారాన్ని, దేశ అభ్యున్నతికీ మూల స్తంభంగా గుర్తిస్తూ దీని  అత్యాధునిక శ్రేణిని, అత్యధిక పోటీ సామర్ధ్యాన్ని ప్రశంసించారు. ఇంకా సౌదీచే జరుపబడిన ఆపరేషన్ - 'రిస్టారింగ్ హోప్ ఇన్ యెమన్' లో BDF గొప్ప మానవతా పూర్వక పాత్రను ప్రదర్శించిందని గుర్తు చేస్తూ, ఉద్యోగుల ధైర్యాన్ని, నైపుణ్యాన్ని కీర్తించారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com