యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో సంచలనం..

- November 29, 2016 , by Maagulf
యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో సంచలనం..

ఓ మహిళ యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ద్వారం నుంచి కిందకు దూకిన ఘటన అమెరికాలో సంచలనం రేపింది. అమెరికాలోని బుష్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఓర్లీన్స్ నుంచి హోస్టన్ వెళ్లేందుకు 1892 నెంబరు యునైటెడ్ ఎయిర్ లైన్సుకు చెందిన విమానం రన్ వే సిద్ధంగా ఉంది. అంతలో విమానంలో ఉన్న ఓ మహిళ ఉన్నట్లుండి విమానం రెక్కల వద్ద ఉన్న అత్యవసర ద్వారం ద్వారా 15 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకింది. విమానాశ్రయం ఆపరేటింగ్ ఏరియాలోకి దూకిన మహిళ విమానం నుంచి దూకుతున్నపుడు ఏమీ మాట్లాడలేదని విమానంలో ఉన్న ప్రయాణికులు చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడనప్పటికీ పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకొని విమానం నుంచి ఎందుకు దూకిందో ప్రశ్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com