చట్నీ పొడి

- April 17, 2015 , by Maagulf
చట్నీ పొడి

కావలసిన పదార్ధాలు:

  • ఆయిల్                                 - 2 టీ స్పూన్లు
  • ఎండు మిరపకాయలు              - 10
  • చట్నీ పప్పు (పుట్నాల పప్పు) - 1 కప్పు
  • ధనియాలు                             - 2 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర                                   - 2 టీ స్పూన్లు
  • ఇంగువ                                  - 1/4 టీ స్పూను
  • వెల్లుల్లి                                   - 6 రెబ్బలు
  • ఉప్పు                                    - తగినంత
  • మెంతులు                              - 1 టీ స్పూను

చేయు విధానం:

  • ముందుగా ఒక బాండీలో నూనె వేడయ్యాక ఎండు మిరపకాయలు వేసి వేయించాలి.
  • ఇప్పుడు మెంతులు, జీలకర్ర వేసి కాస్త వేయించాలి.
  • ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. వేగిన వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆపి చివరగా పుట్నాల పప్పు వేయండి.
  • చల్లారిన తర్వాత ఉప్పు మరియు వెల్లుల్లి వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవటమే.

 

        ----- సి.లీల కుమారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com