కంది పొడి

- April 17, 2015 , by Maagulf
కంది పొడి

కావలసిన పదార్ధాలు:

  • కందిపప్పు          - 1 కప్పు
  • పచ్చి శనగపప్పు - 3/4 కప్పు
  • పెసరపప్పు         - 1/2 కప్పు
  • మినప పప్పు      - 1/4 కప్పు
  • ఎండు మిర్చి      - 12
  • ఇంగువ             - 2 టీ స్పూన్లు
  • జీలకర్ర             - 2 టీ స్పూన్లు
  • ఉప్పు              - తగినంత

చేయు విధానం:

  • ముందుగా ఒక బాండీలో నూనె లేకుండా పైన చెప్పిన నాలుగు పప్పులను విడి విడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే బాండీలో ఇంగువ, జీలకర్ర వేసి ఒక 2 నిమిషాలు వేయించాలి.
  • 1/4 స్పూను నూనె వేసి ఎండుమిర్చి వేయించాలి.
  • అన్ని చల్లారిన తర్వాత ఉప్పు,ఇంగువ,జీలకర్ర (పైన వేయించినవి కాకుండా) వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవటమే.

 

                              ---- వి. రేఖ, దుబాయ్, యు ఏ యి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com