భారత్ - యూ. ఏ. ఈ. ఉమ్మడి కమిషన్ కు అధ్యక్షత వహించిన యూ. ఏ. ఈ విదేశాంగ శాఖ మంత్రి

- September 04, 2015 , by Maagulf
భారత్ - యూ. ఏ. ఈ. ఉమ్మడి కమిషన్ కు అధ్యక్షత వహించిన యూ. ఏ. ఈ విదేశాంగ శాఖ మంత్రి

భారత్- యూ. ఏ. ఈ ఉమ్మడి కమిషన్ యొక్క 11 వ సెషన్ కు యూ. ఏ. ఈ  విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా అధ్యక్షత వహించగా, భారత్ తరపున ఆ దేశ విదేశాంగ శాఖా మంత్రి స్వరాజ్  పాల్గొన్నారు. గతంలో భారత్ లో అబుధాబీ ప్రభుత్వం చమురు నిల్వలను స్థాపించడానికి వ్యూహాత్మకంగా దోహదపడ్డ గత అంటే ఫిబ్రవరి  2013 న నిర్వహించిన రెండు దేశాల ఉమ్మడి సెషన్ విజయవంతమయింది అనడానికి ప్రస్తుత సెషన్ నిదర్శనమని, షేక్ అబ్దుల్లా ప్రకటించారు. ఉమ్మడి ఆసక్తి గల రంగాలలో పెట్టుబడి అవకాశాలను గురించి చర్చిచిన, అన్ని రంగాలలో ఇరుదేశాల సంబందాలను బలోపేతం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడి పర్యటనను ఆయన ప్రశంసించారు. 2016-18 కాలానికి మానవ హక్కుల మండలిలో యూ. ఏ. ఈ భాగస్వామ్యం పొందడానికి ప్రతిపాదించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com