ETCA వారి బతుకమ్మ సంబరాల పోస్టర్ విడుదల

- September 04, 2015 , by Maagulf

ఎమిరేట్స్ తెలంగాణా  కల్చరల్ అసోసియేషన్ (ETCA) వారి బతుకమ్మ సంబరాల పోస్టర్, శుక్రవారం దుబాయ్, కరమాలోని స్వాగత్ హోటెల్ లో ఆవిష్కరించబడింది. ETCA, కళలు, సంస్కృతి రంగాల్లో విశేష కృషి చేసే లాభాపేక్ష లేని సంస్థ. వీరు భారీ జన సమ్మేళనం నడుమ ఘసంగా బతుకమ్మ దసరా సంబరాన్ని 16, అక్టోబర్ లో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా శ్రీ KTR గారు, స్పెషల్ అట్రాక్షన్ గా ప్రముఖ గాయని గాయకులు, లోకల్ గెస్టులుగా ఇండియన్ కౌన్సిలేట్ ప్రతినిధులు  మరియు వివిధ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు.
దీనిలో మహిళల కోసం బతుకమ్మ పాటల పోటీ,  అందమైన మొదటి పది బతుకమ్మలకు విలువైన బహుమతులు, ఉత్తమ మహిళా  గాయనీమణులకు ఆకర్షణీయమైన బహుమతులు,పిల్లల సాంప్రదాయమైన వస్త్రాలంకరణ పోటీలో మొదటి ఐదుగురు చిన్నారులకు బహుమతులు వంటి కొలాహాలంతో ఇది ETCA మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ  సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప సాంస్కృతిక కార్యక్రమం కానుంది. ఈ కార్యక్రమం యొక్క మీడియా పార్టనర్స్ గా  ప్రముఖ తెలుగు ఛానల్స్ మరియు మాగల్ఫ్.కామ్ వ్యవహరించనున్నాయి.


--సి.శ్రీ(దుబాయ్) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com