ఒమాన్ లో ఆగ్రహించిన ప్రకృతి- వర్ష ప్రకోపానికి ముగ్గురి మృతి
- September 04, 2015
ఒమాన్ ఉత్తర భాగంలో కురిసిన భారీ వర్షాలకు ముగ్గురు బలికాగా, రుస్తాక్ మరియు ముత్త్రాలలో ఒకొక్కరూ చొప్పున గల్లంతయ్యారు. వారికోసం పోలీసు హెలికాప్టర్లు గాలిస్తున్నాయి. ఘూబ్రా లోని మస్కట్ గ్రాండ్ మాల్ పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. వర్షం, గాలులు ఇసుక దుమారం తో కూడిన వాతావరణం, ఒమాన్ జన జీవితాన్ని స్తంభింపజేసింది. ఐతే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము వాహనాలు, అంబులెన్స్ లతో సర్వసన్నద్ధంగా ఉన్నామని పోలీసు శాఖ వారు హామీ ఇచ్చారు. రానున్న 48 గంటలలో ఒమాన్ ఉత్తర మరియు మధ్య భాగాల్లో మరింతగా వర్షాలు కురిసే అవకాశముందని దేశ వాతావరణ శాఖ వారు ప్రకటించారు. సముద్రం పరిస్థితి తీవ్రంగా ఉందని, 3 మీటర్ల ఎత్తు వరకు అలలూ ఎగిసిపడే అవకాశముందని, ఎవరైన ఇలాంటి వాతావరణంలో వాడీ ని దాటాడానికి ప్రయత్నించే ముందు తమ పిల్లలను, కుటుంబాన్ని గురించి ఆలోచించాలని అధికారులు హెచ్చరించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







