ETCA వారి బతుకమ్మ సంబరాల పోస్టర్ విడుదల
- September 04, 2015
ఎమిరేట్స్ తెలంగాణా కల్చరల్ అసోసియేషన్ (ETCA) వారి బతుకమ్మ సంబరాల పోస్టర్, శుక్రవారం దుబాయ్, కరమాలోని స్వాగత్ హోటెల్ లో ఆవిష్కరించబడింది. ETCA, కళలు, సంస్కృతి రంగాల్లో విశేష కృషి చేసే లాభాపేక్ష లేని సంస్థ. వీరు భారీ జన సమ్మేళనం నడుమ ఘసంగా బతుకమ్మ దసరా సంబరాన్ని 16, అక్టోబర్ లో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ KTR గారు, స్పెషల్ అట్రాక్షన్ గా ప్రముఖ గాయని గాయకులు, లోకల్ గెస్టులుగా ఇండియన్ కౌన్సిలేట్ ప్రతినిధులు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు.
దీనిలో మహిళల కోసం బతుకమ్మ పాటల పోటీ, అందమైన మొదటి పది బతుకమ్మలకు విలువైన బహుమతులు, ఉత్తమ మహిళా గాయనీమణులకు ఆకర్షణీయమైన బహుమతులు,పిల్లల సాంప్రదాయమైన వస్త్రాలంకరణ పోటీలో మొదటి ఐదుగురు చిన్నారులకు బహుమతులు వంటి కొలాహాలంతో ఇది ETCA మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప సాంస్కృతిక కార్యక్రమం కానుంది. ఈ కార్యక్రమం యొక్క మీడియా పార్టనర్స్ గా ప్రముఖ తెలుగు ఛానల్స్ మరియు మాగల్ఫ్.కామ్ వ్యవహరించనున్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)


తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







