'ఎంఎస్ ధోని' ఆస్కార్ జాబితాలో!
- December 22, 2016భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ' చలనచిత్రం ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు అర్హత చిత్రాల సుదీర్ఘ జాబితాలో చోటు దక్కించుకుంది. ఆ చిత్రంతోపాటు ఐశ్వర్యారాయ్ బచ్చన్ రణదీప్ హుడా ప్రధాన పాత్రల్లో నటించిన సరబ్జిత్ సినిమా కూడా ఆస్కార్ అర్హత దక్కించుకున్న 336 ఫీచర్ సినిమాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ రెండూ జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలే కావడం గమనార్హం. ఆస్కార్ అర్హత సాధించిన జాబితాలోని ఫీచర్ సినిమాల వివరాలను బుధవారం 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' విడుదల చేసిందని ఎంటర్టైన్ మెంట్ వీక్లీ పేర్కొంది.
2016 ఏడాదికిగానూ అకాడమీ అవార్డుల జాబితాలో ఉన్న ఈ సినిమాల్లో.. లాస్ ఏంజెలిస్‌లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కనీసం వారంపాటు ప్రదర్శితమైన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. 35 ఎంఎం లేదా 70 ఎంఎం సినిమా లేదా అర్హత కలిగిన డిజిటల్ ఫార్మాట్లో కనీసం 40 నిమిషాల నిడివికి మించ కుండా ఉండాలి. ఆస్కార్ అర్హ త జాబితాలో క్వీన్ ఆఫ్ కత్వే, లాలా లాండ్, మూన్ లైట్, మాంచెస్టర్ బై ది సీ, సైలెన్స్, అరైవల్, హాక్షా రిడ్జ్, డెడ్‌పూల్, సూసైడ్ స్క్వాడ్, కెప్టెన్అమెరికా, సివిల్ వార్, ఎక్స్‌మెన్ లాంటి చిత్రాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?