ఇస్తాంబుల్‌లో తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్..
- January 01, 2017
బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, టర్కీలోని ఇస్తాంబుల్‌లో తీవ్రవాదులు జరిపిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, చాలామంది తీవ్రగాయాల పాలయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపిన బహ్రెయిన్, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రపంచమంతా తీవ్రవాదాన్ని ఖండించాలనీ, తీవ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని బహ్రెయిన్ ఈ సందర్బంగా అభిప్రాయపడింది. బహ్రెయిన్, టర్కీకి ఆపద సమయంలో అండగా ఉంటుందని సంతాప సందేశంలో బహ్రెయిన్ పేర్కొంది. బహ్రెయిన్ ప్రజలందరి తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రస్తావించింది.
తాజా వార్తలు
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు..







