మోసపూరిత నియామక ఏజెంట్లపై భారతీయ కార్మికులు పిర్యాదు చేయండి..

- January 02, 2017 , by Maagulf
మోసపూరిత నియామక ఏజెంట్లపై  భారతీయ కార్మికులు పిర్యాదు చేయండి..

యుఎఇ లో భారతదేశం యొక్క కొత్త రాయబారి నూతన సంవత్సరం మొదటి రోజున డుబై వసతిని సందర్శించినపుడు భారతదేశంలో నియామక ఏజెంట్లు చేసే మోసపూరిత వాగ్దానాలు తమ ప్రాధమిక సమస్య అని భారతీయ కార్మికుల ఆరోపించారు. నవదీప్ సింగ్ సూరి, కేవలం గత నెలలో బాధ్యతలు చేపట్టిన ఆయన దుబాయ్లోని బ్రూక్ మల్టీప్లెక్స్ సిబ్బంది వసతి గృహాన్ని ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు.ఆయన కార్మికులతో జరిగిన బహిరంగ సంభాషణలో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.భారతదేశంలో ఏజెంట్లు చేసే నకిలీ వాగ్దానాలు గురించి తెలియచేస్తూ ఆయన మాట్లాడుతూ,' ఏ ఏజెంట్ ఐనా మిమ్ములను మోసపర్చే విధంగా..తప్పుదారి పట్టించే విధంగా జీతం లేదా ఇతర ఉద్యోగ సంబంధిత సమస్యలు పరంగా అబద్ధపు వాగ్ధానాలు చేసే వారి పేర్లు తమకు దయచేసి ఇవ్వాలని మరియు మేము వారికి  వ్యతిరేకంగా తగిన చర్య తీసుకొంటామని అవసరమైతే, భారత ప్రభుత్వం ఆ ఏజెంట్లను  బ్లాక్ లిస్ట్  చేస్తామని పేర్కొన్నారు. భారత కార్మికులు వారి వారి పాస్పోర్టులు, వీసాలు గురించి జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. అన్ని అవసరమైన పత్రాలకు సంబంధిన ఒక్కొక కాపీని ఇంట్లో ఉంచడానికి ప్రయత్నించాలని ఇది అత్యవసర సమయంలో ఈ చర్య  చాలా ముఖ్యం అని అన్నారు. ఈ దేశం అనేక మంది భారతీయులకు నిలయమని ఈ దేశ చట్టాలను గౌరవించి మరియు వాటిని అనుసరించండని కోరారు.రాబోయే రోజుల్లో మరిన్ని కార్మిక వసతి గృహాలను సందర్శించనున్నట్లు రాయబారి సూరి పేర్కొన్నారు. వ్యవస్థలో పారదర్శకత లక్ష్యంగా గత ఏడాది ప్రారంభించిన ఈ - వలస నియామక పథకం గురించి ఆయన పేర్కొన్నారు. కార్మికుల హక్కులు మరియు బాధ్యతలను గురించి మరింత అవగాహనతో ఉండాలని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com