అత్యాధునిక సుఖోయ్ విమానాలు చైనాకి అందజేసిన రష్యా..
- January 02, 2017
మన పొరుగు దేశమైన చైనాకు రష్యా అత్యాధునిక సుఖోయ్ ఎస్‌యూ -35 యుద్ధవిమానాలను అందజేసింది. ఇప్పటికే చైనా జె-20 స్టెల్త్ జెట్‌ను తయారు చేస్తుండటంతో రష్యా ఈ డీల్ విషయంలో వేగంగా వ్యవహరించింది. జె-20లు సిద్ధమైతే చైనా మార్కెట్లో ఎస్‌యూ-35 విలువ పడిపోతుందని రష్యా భయపడింది. అందుకే రెండేళ్లుగా నిదానంగా ఉన్న ఈ డీల్‌ను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా డిసెంబర్ 25న రెండు విమానాలను చైనాకు అందజేసింది. ఈ విషయాన్ని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది.
చైనా ఇప్పటికే తన వాయుసేన ఆధునికీకరణను వేగవంతం చేసింది. దీనిని పూర్తిగా కొత్తతరం ఫైటర్ జెట్లతో నింపుతోంది.
స్టెల్త్జెట్ జె-15 ఇప్పటికే చైనా వాయుసేనలో చేరింది. ప్రస్తుతం దీనిని విమాన వాహక నౌకపై దక్షిణ చైనా సముద్రంలో మోహరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్







