తలైవా '2.0' సెట్‌లో..

- January 02, 2017 , by Maagulf
తలైవా '2.0' సెట్‌లో..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా 'రోబో'కి సీక్వెల్‌గా శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం '2.0'. ఈ చిత్రం సెట్‌లో తీసిన ఒక ఫొటోను శంకర్‌ సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. '2.0'17.. అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 2017లో అత్యంత భారీ బడ్జెట్‌తో విడుదలౌతోన్న చిత్రాల్లో '2.0' ఒకటి. దాదాపు రూ. 400 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీ జాక్సన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించడం మరో ఆసక్తికర అంశం. .
ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ముంబయిలో విడుదల చేశారు.

ప్రస్తుతం చిత్రం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్‌, జపనీస్‌, చైనీస్‌ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ '2.0'కి స్వరాలు సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com