మొరాకో చికెన్ మసాలా......
- January 05, 2017కావలసిన పదార్థాలు: చికెన్ - అరకేజీ, ఉల్లిపాయలు - 2, టమోటాలు -2, పెరుగు - అరకప్పు, పసుపు - పావు టీ స్పూను, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 6, వెల్లుల్లి రేకలు - 5, అల్లం ముక్క - అరంగుళం, మిరియాలు - 8, మెంతులు, జీలకర్ర, గసగసాలు - 1 టీ స్పూను చొప్పున, కొత్తిమీర - గుప్పెడు, లవంగాలు, యాలకులు - 2 చొప్పున, దాల్చినచెక్క - చిన్న ముక్క, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: శుభ్రం చేసిన చికెన్ ముక్కలకు నిమ్మరసం, పెరుగు, ఉప్పు, పసుపు పట్టించి పక్కనుంచాలి. ఎండుమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, మెంతులు, జీలకర్ర, గసగసాలు వేగించి చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి. నూనెలో ఉల్లి తరుగు దోరగా వేగించి, టమోటా ముక్కలు కూడా వేసి, అవి మెత్తబడ్డాక మసాల పేస్టు కలపాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు కలిపి, రెండు నిమిషాల తర్వాత అరకప్పు నీరు పోసి మూతపెట్టి చిన్నమంటపై మగ్గించాలి. దించేముందు మరోసారి నిమ్మరసం పిండి కొత్తిమీర చల్లాలి. తందూరి, పరాటాలతో మంచి కాంబినేషన్.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక