పంక్చువాలిటీ: టాప్‌ టెన్‌లో బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్ట్‌

- January 05, 2017 , by Maagulf
పంక్చువాలిటీ: టాప్‌ టెన్‌లో బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్ట్‌

మనామా: బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ పంక్చువాలిటీ పరంగా టాప్‌ 10 ఎయిర్‌పోర్టుల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 85 శాతానికి పైగా విమానాలు పంక్చువాలిటీని పాటిస్తున్నట్లుగా ఓ సర్వేలో తేలింది. ఏడాదికి 87,000 ఎరైవల్స్‌ బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ పోర్ట్‌లో జరుగుతాయి. జిసిసి దేశాల్లో బహ్రెయిన్‌కి మాత్రమే పంక్చువాలిటీ కేటగిరీలో టాప్‌ టెన్‌లో స్థానం దక్కింది. యూకే ఏవియేషన్‌ అనలిస్ట్స్‌ ఓఎజి ఈ సర్వే చేసింది. 2016కి సంబంధించి 54 మిలియన్‌ ఫ్లైట్‌ డేటాని బట్టి విశ్లేషించింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌ ఎయిర్‌పోర్ట్‌ 91 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానం ఒసాకాది కాగా, పనామా సిటీ, బెలో హోరిజోంటె, కోలోగ్న్‌ బోన్‌, కేప్‌టౌన్‌, మిలాన్‌ బెర్గామో, పెర్త్‌, బహ్రెయిన్‌, అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ మిగతా స్థానాల్లో నిలిచాయి. బహ్రెయిన్‌కి 9వ స్థానం దక్కింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com