జనవరి 8 నుంచి ఇండియన్ స్కూల్స్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
- January 05, 2017
మస్కట్: మస్కట్‌లోని ఇండియన్ స్కూల్స్‌లో అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 8న ప్రారంభం కానుంది. కెజి నుంచి 9వ తరగతి వరకు ఈ అడ్మిషన్లు ఉంటాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ఇండియన్ స్కూల్స్ ఇన్ ఒమన్ ఈ సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. పేరెంట్స్‌కి, అలాగే స్కూల్స్‌కి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇండియన్ స్కూల్ మస్కట్, ఇండియన్ స్కూల్ దర్‌సైత్, ఇండియన్ స్కూల్ వాడి కబిర్, ఇండియన్ స్కూల్ గుబ్రా, ఇండియన్ స్కూల్ సీబ్, ఇండియన్ స్కూల్ మయీబెలా తదిర స్కూళ్ళకు ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఫిబ్రవరి 15తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేసిన అప్లికేషన్‌ని, అవసరమైన డాక్యమెంట్లతోపాటు పైన పేర్కొనబడిన ఆరు స్కూళ్ళలో ఏదో ఒక దాంట్లో సబ్‌మిట్ చేయవలసి ఉంటుంది. వెబ్‌సైట్‌లోనూ పేరెంట్స్‌కి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







