హిట్ అండ్ రన్: ఇద్దరి మృతి
- January 05, 2017
దుబాయ్: హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత శుక్రవారం అంటే డిసెంబర్ 30వ తేదీన ఉదయం 5 గంటల సమయంలో మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆసియాకి చెందిన 30 ఏళ్ళ వ్యక్తి, 20 ఏళ్ళ వ్యక్తి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన వాహనంతో సహా డ్రైవర్ పారిపోయాడు. అయితే ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన కారుని గుర్తించి, డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆసియాకి చెందిన ఓ మహిళ పేరుతో ఆ వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉంది. తన సోదరుడు ఆ రోజు రాత్రి తన కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినట్లు వాహన యజమాని అయిన మహిళ పోలీసులకు వాంగ్మూలమిచ్చారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







