హిట్ అండ్ రన్: ఇద్దరి మృతి
- January 05, 2017దుబాయ్: హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత శుక్రవారం అంటే డిసెంబర్ 30వ తేదీన ఉదయం 5 గంటల సమయంలో మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆసియాకి చెందిన 30 ఏళ్ళ వ్యక్తి, 20 ఏళ్ళ వ్యక్తి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన వాహనంతో సహా డ్రైవర్ పారిపోయాడు. అయితే ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన కారుని గుర్తించి, డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆసియాకి చెందిన ఓ మహిళ పేరుతో ఆ వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉంది. తన సోదరుడు ఆ రోజు రాత్రి తన కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినట్లు వాహన యజమాని అయిన మహిళ పోలీసులకు వాంగ్మూలమిచ్చారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు