బహ్రైన్ లోని జింజ్ లో తగలబడిన పాడుబడ్డ ఇల్లు
- September 10, 2015
నిన్న బహ్రైన్ దేశంలోని జింజ్ లో హైవే 35లో ఉన్న షేక్ ఇస్ బిన్ సల్మాన్ హైవే పరిధిలోకి వచ్చే మంటలు రేగుతున్న పాత ఇంటిని ఆర్పి, పరిస్థితిని అదుపులోకి తేవడానికి అగ్నిమాపక సిబ్బంది రెండుగంటల పాటు శ్రమించారు. సాయంత్రం 5.30 గంటలకు దారిన వెళుతున్న వ్యక్తినించి సమాచారం అందుకున్న పౌర భద్రత దళం వారు ప్రమాదస్థలానికి 3 ఫైర్ ఇంజన్లు, అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి అంబులెన్స్ ను కూడా రప్పించారు. ప్రత్యక్ష సాక్షి కధనం ప్రకారం, మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఐతే ఎవరూ గాయపడలేదని తెలిసింది. ఇల్లు పూర్తిగా 100 శాతం కాలిపోయిందని, ఐతే అదృష్టవశాత్తూ పక్కనున్న భవనంపై మాత్రం అంతగా ప్రభావం పడలేదని అక్కడి అధికారి చెప్పారు. అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి అంబులెన్స్ ను కూడా రప్పించారు. ఇంటిలో ఎవరూ లేరని, చాలరోజుల బట్టి ఖాళీగా ఉన్నందువలన చెత్త చెదారం పేరుకొని, రాపిడి వలన అంతుకొని ఉండచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







