బహ్రైన్ లోని జింజ్ లో తగలబడిన పాడుబడ్డ ఇల్లు

- September 10, 2015 , by Maagulf
బహ్రైన్ లోని జింజ్ లో తగలబడిన పాడుబడ్డ ఇల్లు

నిన్న బహ్రైన్ దేశంలోని జింజ్ లో హైవే 35లో ఉన్న షేక్ ఇస్ బిన్ సల్మాన్ హైవే పరిధిలోకి వచ్చే మంటలు రేగుతున్న పాత ఇంటిని ఆర్పి, పరిస్థితిని అదుపులోకి తేవడానికి అగ్నిమాపక సిబ్బంది రెండుగంటల పాటు శ్రమించారు. సాయంత్రం 5.30 గంటలకు దారిన వెళుతున్న వ్యక్తినించి సమాచారం అందుకున్న పౌర భద్రత దళం వారు ప్రమాదస్థలానికి 3 ఫైర్ ఇంజన్లు, అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి అంబులెన్స్ ను కూడా రప్పించారు.  ప్రత్యక్ష సాక్షి కధనం ప్రకారం, మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఐతే ఎవరూ గాయపడలేదని తెలిసింది.  ఇల్లు పూర్తిగా  100 శాతం కాలిపోయిందని, ఐతే అదృష్టవశాత్తూ పక్కనున్న భవనంపై మాత్రం అంతగా ప్రభావం పడలేదని అక్కడి అధికారి చెప్పారు. అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి అంబులెన్స్ ను కూడా రప్పించారు. ఇంటిలో ఎవరూ లేరని, చాలరోజుల బట్టి ఖాళీగా ఉన్నందువలన చెత్త చెదారం పేరుకొని, రాపిడి వలన అంతుకొని ఉండచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com