బాలయ్య అభిమానులకు మరో గుడ్‌న్యూస్!
- January 05, 2017
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఈ నెల 12న భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కథనే హీరోగా చేసి సినిమాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్ శాతకర్ణికి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా పాటలు మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ లేకుండా సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. సినిమా చూసిన అనంతరం సెన్సార్ సభ్యులు సినిమా టీంను అభినందించారట. సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చారట. దీంతో ఇప్పటికే ట్రైలర్ చూసి ఉబ్బితబ్బిబయిన ఫ్యాన్స్ సెన్సార్ స్పందనతో మరింత సంబరపడిపోతున్నారు.
సంక్రాంతి హీరో బాలయ్యేనని కన్ఫామ్ చేసేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ సినిమా కేవలం బాలయ్య ఫ్యాన్స్‌కే కాదు తెలుగు జాతికి కూడా ప్రపంచ వ్యాప్త గుర్తింపు తేవడం ఖాయంగానే కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







