ఖర్చులేకుండా ఉపయోగపడే బరువు తగ్గించే వేడి పానీయాలు

- September 10, 2015 , by Maagulf
ఖర్చులేకుండా ఉపయోగపడే బరువు తగ్గించే వేడి పానీయాలు

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ప్రతి ఒక్క అమ్మాయి స్మార్ట్ గా స్లిమ్ గా ఉండాలని కోరుకుంటుంది. అందుకు చాలా మార్గాలున్నాయి. శరీరంలో కొన్ని పౌండ్ల బరువు తగ్గించుకోవడానికి క్యాలరీలను బర్న్ చేసుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ మార్గాలున్నాయి. బరువు తగ్గించుకోవడం ఒక టాక్స్ వంటిది, ముఖ్యంగా డైట్ మరియు వ్యాయామం ఫాలో అవ్వకపోతే మరింత కష్టం. అయితే, ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, కొన్ని హాట్ బెవరేజస్ (పానీయాలు)బరువు తగ్గిస్తాయిని తెలియజేస్తున్నారు. ఈ హాట్ బెవరేజెస్ ను త్రాగినప్పుడు శరీరంలోని కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.నిద్రలేమి సమస్యను నివారించే హెల్తీ బెడ్ టైమ్ డ్రింక్స్ అయితే, ఈ వెయిట్ లాస్ చిట్కా వల్ల ఒక ప్రతి కూల ప్రభావం కూడా ఉన్నది. కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇంట్రడక్షన్ లో తెలిపిన విధంగా ఈ క్రింది తెలిపిన బెవరేజస్ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అదిబరువు, హై క్యాలరీలు, ఫ్యాట్ తగ్గించుకోవడానికి సమయం లేనప్పుడు ఈ చిట్కాలు అనుసరించం ఒక మంచి ఉపాయం. జుట్టు సంరక్షణకు బెవరేజస్ తో అధిక లాభం.! మరి ఇంకెందుకు ఆలస్యం యమ్మీ హాట్ బెవరేజస్ ను త్రాగి బరువు తగ్గడానికి ప్రయత్నించండి...బ్లాక్ కాఫీ బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ హాట్ బెవరేజ్ . రోజులో రెండు సార్లు బ్లాక్ కాఫీ , షుగర్ లేకుండా త్రాగడం వల్ల ఆలస్యంగా అయినా బరువు తగ్గించుకోవచ్చు. బరువు తగ్గించుకోడానికి గ్రీన్ టీ మరో హోం రెమెడీ . ఒక కప్పు వేడి వేడి గ్రీన్ టీలో ఒక టేబుల్ స్పూన్ తేనె చేర్చి త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా గ్రీన్ టీలో 2-3చుక్కల నిమ్మరసం చేర్చడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . గ్రీన్ టీని ఖాలీపొట్టతో ఉదయం నిద్రలేవగానే తీసుకోవాలి బరువు తగ్గించుకోడానికి మరో ఎఫెక్టివ్ హాట్ బెవరేజ్ బ్లాక్ టీ . బ్లాక్ టీని కూడా ఖాలీ పొట్టతో తీసుకోవడం మంచిది అందులో కొద్దిగా నిమ్మరసం, మరియు తేనె మిక్స్ చేసుకుంటే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. హాని టీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే త్రాగాలి . ఈ టీని రోజులో కనీసం మూడు సార్లు తీసుకుంటే బరువు తగ్గడానికి మరింత మంచిది . గొంతు నొప్పిగా ఉన్నట్లైతే కొద్దిగా వేడినీళ్ళను జోడించుకోవచ్చు. దాల్చిన చెక్క టీ, వారం పొడవునా తీసుకొన్న మంచి ఫలితం ఉంటుంది. అందులో చాలా త్వరగా మీరు అనుకున్న ఫలితాలను సాధించవచ్చు . ఈ హాట్ బెవరేజ్ త్రాగడం వల్ల మంచి జీర్ణక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి మింట్ టీ ఒక ఎఫెక్టివ్ హాట్ బెవరేజ్. ఈ మింట్ టీ త్రాగడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com