'టామ్‌కామ్' బాసట గల్ఫ్ ఉద్యోగార్థులకు...
- January 22, 2017
అర్హులైన అభ్యర్థులను గల్ఫ్ కంపెనీలు ఎంపిక చేసుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థ 'టామ్‌కామ్' సహకరిస్తుందని మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గల్ఫ్‌లో ఉద్యోగాలకు అనువుగా వీలైతే అభ్యర్థులకు తామే శిక్షణ ఇప్పించడానికి కూడ సిద్ధమని ఆయన చెప్పారు. దళారుల ప్రలోభాలతో వృత్తి నైపుణ్యంలేని యువత ఉద్యోగాల కోసం గల్ఫ్‌కు వస్తుండడంతో అటు యాజమానులతో పాటు రాషా్ట్రనికీ, దేశానికి కూడ ఇబ్బంది, నష్టం కల్గిస్తుందని మంత్రి చెప్పారు. కువైట్‌లోని భారతీయ ఎంబసీ అవరణలో శనివారం ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు.
కువైతీ యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్ధ ద్వారా నియామకంతో ఖర్చు తగ్గి, అర్హులైన వారిని ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. కువైట్‌లో 1.2బిలియన్ దినార్లతో ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని, దీనికి నిపుణులపై 50వేల మంది ఉద్యోగ, కార్మికులు అవసరమని కువైటీ ప్రతినిధులు మంత్రితో చెప్పారు. గల్ఫ్ పర్యటనలో ఉన్న నాయిని శుక్రవారం ఖతర్‌లోని తెలంగాణ ప్రవాసీ ప్రముఖులను కలిశారు. తెలంగాణ యువతను సురక్షితంగా గల్ఫ్ ఉద్యోగాలలో నియమించేలా 'టామ్‌కామ్' ద్వారా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మంత్రి వారికి వివరించారు.
ఈ మేరకు మూడు సంస్ధలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రవాసీయులు మంత్రికి సహాయపడ్డారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







