మన చేనేతను ప్రమోట్ చేసిన కేటీఆర్ జపాన్‌లో...

- January 24, 2017 , by Maagulf
మన చేనేతను ప్రమోట్ చేసిన కేటీఆర్ జపాన్‌లో...

ఐటీ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు.  ఆలోమోబైల్ తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించేందుకు మంత్రి జపాన్‌లో పర్యటిస్తున్నారు. పనిలోపనిగా చేనేతను ప్రమోట్ చేసేందుకు ఉన్న అవకాశాలను మంత్రి ఉపయోగించుకుంటున్నారు.  జపాన్‌లో పర్యటిస్తున్న మంత్రి ఆ దేశ అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ అయిన ముజీ డైరక్టర్ షిమిజును కలిశారు.  ఈ సందర్భంగా కేటీఆర్ పోచంపల్లి చేనేతను పరిచయం చేశారు.  సిల్క్ చీరను, శాలువాను ఆయనకు బహుకరించారు.  
చేనేత కార్మికులను ఆదుకునేందుకు, వారు నేస్తున్న చేనేత వస్త్రాలకు విక్రయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేనేత లక్ష్మీ పథకంను తీసుకు వచ్చింది.  ఇటీవల అసెంబ్లీలో సైతం చేనేత ప్రదర్శన ఏర్పాటు చేశారు.  ప్రజాప్రతినిధులంతా చేనేత వస్త్రాలు ధరించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com