రవితేజ హీరోగా 'రాజా ది గ్రేట్'...

- January 26, 2017 , by Maagulf
రవితేజ హీరోగా 'రాజా ది గ్రేట్'...

లాంగ్ గ్యాప్ తరువాత మాస్ మహరాజ్ రవితేజ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. దాదాపు సంవత్సర కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ హీరో, ఒకేసారి రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అంతేకాదు ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను కూడా రిలీజ్ చేసిన అభిమానులను ఖుషీ చేస్తున్నాడు.

జనవరి 26న తన పుట్టిన రోజు కానుకగా 'టచ్ చేసి చూడు' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రాజా ది గ్రేట్' టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో కనిపించనున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com