సుకుమార్ స్కూల్ లో పర్మనెంట్ యాక్టర్..
- January 30, 2017
స్టైలిష్ మేకర్ సుకుమార్ సినిమాలు యువతను బాగా ఆకట్టుకుంటాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకోకపోయినా స్టార్ హీరో సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ డైరక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా వస్తున్న సినిమా ఈరోజు లాంచనంగా స్టార్ట్ అయ్యింది. విలేజ్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో సుకుమార్ విలన్ గా మళ్లీ జగపతిబాబునే తీసుకున్నాడట.
హీరోగా కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి విలన్ గా కొత్త టర్న్ తీసుకున్న జగపతి బాబు సూపర్ సక్సెస్ అవడంతో ఇప్పుడు అదే క్రేజ్ తో వరుస అవకాశాలను అందుకుంటున్నారు. ఇప్పటికే సుకుమార్ తో నాన్నకు ప్రేమతో సినిమా చేసిన జగ్గు భాయ్ ఇప్పుడు చెర్రి సినిమాలో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
అంతేకాదు సుకుమార్ ఇక మీద తీసే సినిమాల్లో కూడా జగపతి ఉండటం మాత్రం ఖాయమని అంటున్నారు.
ఎందుకు ఏమిటి అని తెలియదు కాని జగపతి యాక్షన్ కు సుక్కు ఎలాగైనా సరే తన సినిమాలో రోల్ ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడట. మరి సుకుమార్ స్కూల్ లో పర్మనెంట్ యాక్టర్ గా జగపతి ఇంకా మంచి మంచి సినిమాల్లో నటిస్తాడని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విలన్ గా సూపర్ ఫాంలో ఉన్న జగపతి బాబు కెరియర్ మంచి జోష్ లో కనిపిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







