మక్కా క్రేన్ దుర్ఘటనలో బాధితులకు 1 మిలియన్ రియాళ్ల నష్టపరిహారం

- September 16, 2015 , by Maagulf
మక్కా క్రేన్ దుర్ఘటనలో బాధితులకు 1 మిలియన్ రియాళ్ల నష్టపరిహారం

మక్కా క్రేన్ దుర్ఘటన మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి 1 మిలియన్ (పది లక్షల) రియాళ్లను, గాయపడిన వారికి అర మిలియన్(5 లక్షల) రియాళ్లను సౌదీ అధినేత కింగ్ సల్మాన్ నష్టపరిహారంగా ప్రకటించారు.  ఇంకా మృతుల కుటుంబాల నుండి ఇద్దరికి చొప్పున హజ్-2016 యాత్ర లో సౌదీ రాజు గారి అతిధ్యం పొందుతారని వాగ్దానం చేశారు.

ఈ సంఘటనపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిషన్, ఆ శుక్రవారం 107 గురి మృతికి, 400 మంది గాయపడడానికి కారణమైన క్రేన్ దుర్ఘటనకు బిన్ లాదిన్ గ్రూపు కంపెనీ వారే కారణమని తేల్చింది. ఈ కంపెనీ వారు భద్రత ప్రమాణాలను పాటించకపోవడం వలనే తుఫాను గాలులకు నిలువలేక క్రేన్ పడిపోయిందని తేల్చారు. న్యాయపరమైన విచారణ పూర్తయ్యే వరకు, సౌదీని విడిచి వెళ్లరాదని ఆ కంపెనీ ఉద్యోగులను ఆదేశించారు. కొత్త పబ్లిక్ ప్రాజెక్టులు నిర్వహించడానికి ఈ కంపెనీకి అనుమతిని రద్దు చేసింది. ఈ కంపెనీ గత 4 సంవత్సరాలుగా, రెండు మిలియన్ల మందికి ఆశ్రయమిచ్చేలా గ్రాండ్ మసీదును  4,00,000 (నాలుగు లక్షల) చదరపు మీటర్లమేరకు  విస్తరించే పనిలో ఉన్న సంగతి విదితమే.  

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com