మాటలు జాగ్రత్త: దుబాయ్ వ్యాపారవర్గాలకు హెచ్చరిక
- September 16, 2015
దుబాయ్లోని వ్యాపార వర్గాలు అడ్వటైజ్‌మెంట్లు, పాంప్లేట్‌లు, ఇతర ప్రచార కార్యక్రమ సామగ్రి ని ముద్రించి, పంచే ముందు సరిచూసుకోవలసిందిగా దుబాయి ఆర్ధికాభివృద్ధి శాఖ సీనియర్ డైరక్టర్ ఖలిద్ అల్ బూమ్ తెలియజేశారు. అంతేకాకుండా భోజన శాలల వద్ద, మెన్యు లపై కూడా పదార్ధాల పేరును అరబిక్‌లో తెలిసేలా రాయించాలని ఆయన చెప్పారు. వారి ట్రేడ్ లైసెన్స్ మీద, దుఖానం పేరు కూడా అరబిక్‌లో తప్పులు లేకుండా ఉండేలా జాగ్రత్త వహించాలని ఆ విధంగా లేని సంస్థలు బుక్ చేయబడతాయని, ముఖ్యంగా కేఫ్ లు రెస్టారెంట్లు లక్ష్యంగా తనిఖీలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అడ్వటైజ్ మెంట్ల వల్ల సత్ప్రభావాలు, దుష్ప్రభావాలు కూడా ఉంటాయని, లోపభూయిష్టంగా ఉన్న అడ్వటైజ్ మెంట్ల వల్ల వినియోగదారులు వెను తిరిగే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







