సప్తగిరి ఎక్స్ ప్రెస్ నాన్ స్టాప్ 50 రోజులు...
- February 09, 2017
శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా నిర్మించిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్. అరుణ్ పావర్ దర్శకత్వంలో గతేడాది డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ కమీడియన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. డాక్టర్ రవికిరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కామెడీతో పాటు సప్తగిరి చేసిన యాక్షన్, ఫైట్స్, డాన్స్ కు మాస్ ఆడియోన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా సప్తగిరి ఎక్స్ ప్రెస్ కు ప్రశంసలు అందుతున్నాయి. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన డాక్టర్ రవికిరణ్ తొలిప్రయత్నంలోనే కమర్షియల్ సక్సెస్ అందుకున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫిబ్రవరి 10తో సప్తగిరి ఎక్స్ ప్రెస్ విడుదలై 50 రోజులు పూర్తి అవుతాయి. ఈ నేపథ్యంలో 50 రోజులు వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు, నిర్మాత రవికిరణ్ తో పాటు సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాల్ని ప్రకటిస్తామని, నాన్ స్టాప్ గా 50 సెంటర్లలో సప్తగిరి ఎక్స్ ప్రెస్ 50 రోజులు పూర్తి చేసుకుందని, ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి చిత్ర బృందం తరుపున ధన్యవాదాలు తెలిపారు డాక్టర్ రవికిరణ్. కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా అలరిస్తోన్న ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, ఫైట్స్ : స్టంట్స్ జాషువా, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







