గల్ఫ్ లోనూ గర్జిస్తున్న 'సింగం-3'
- February 09, 2017తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సింగం 3 చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదలైంది. రిలీజైన అన్ని సెంటర్లలో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా, కలెక్షన్స్ పరుగులు పెడుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో చిత్ర రిలిజ్ కొద్దిగా ఆలస్యమైనప్పటికి వసూళ్ళ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదని తెలుగు ప్రొడ్యూసర్ మల్కాపురం శివకుమార్ తెలిపారు. ఓవర్సీస్ లోను ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నది. గల్ఫ్ ప్రాంతంలో రజినీకాంత్ నటించిన 'కబాలి' తర్వాత అంతటి స్థాయిలో రిలీజ్ అయిన చిత్రం గా సూర్య 'సింగం 3' రికార్డుకెక్కింది. కేరళలో 218 థియేటర్లలో సింగం 3 చిత్రం నడుస్తోండగా, బెంగుళూరులో 317 థియేటర్లలో , ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 26 దేశాల్లో 463 లొకేషన్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది.
గురువారం దుబాయ్ లో ప్రీమియర్ షో కి విచ్చేసిన హీరో సూర్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. సింగం సిరీస్ లో భాగంగా హరి తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్, అనుష్క కథానాయికలుగా నటించారు. ఈ ఇద్దరు భామలు కూడా తమ నటనతో పాటు గ్లామర్ తో ఆకట్టుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ