నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ37

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ37

భారత అంతరిక్ష పరిశోదనా సంస్థ(ఇస్రో) చరిత్రాత్మక అంతరిక్ష ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ వేదికైంది. ఈ ఉదయం 9.28 గంటలకు షార్ లోని మొదటి ప్రయోగ కేంద్రం నుంచి 104 ఉపగ్రాలతో పీఎస్ ఎల్ వీ-సీ37 వాహకనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇది మొత్తం 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యావర్తన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది. 28.42 నిమిషాల్లో రాకెట్‌ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించనుంది. ప్రయోగం ప్రారంభమైన తర్వాత 17.29 నిమిషాలకు కార్టోశాట్‌-2.. రాకెట్‌ నుంచి 510.383 కిలోమీటర్ల ఎత్తులో విడిపోనుంది. ఐఎన్‌ఎస్‌-1ఏ 17.29 నిమిషాలకు, ఐఎన్‌ఎస్‌-1బి 17.40 నిమిషాలకు వాహక నౌక నుంచి విడిపోనున్నాయి. దీని తర్వాత 18.32 నిమిషాల నుంచి 28.42 నిమిషాల మధ్య విదేశీ ఉపగ్రహాలన్నీ 524 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్‌ నుంచి విడిపోయేలా ఇస్రో శాస్త్రవేత్తలు వాహక నౌకను సిద్ధం చేశారు. ఒకేసారి 104 ఉపగ్రహాలు ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే ఇస్రో నూతన అధ్యాయానికి తెరలేపింది.

Back to Top