ఆంధ్రప్రదేశ్ వ్యూహరచనకై బాబు సింగపూర్ పర్యటన !

- September 21, 2015 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ వ్యూహరచనకై బాబు సింగపూర్ పర్యటన !

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సింగపూర్‌లో పర్యటన రెండవ రోజుకు చేరకుంది.సోమవారం ఉదయం ఆయన సింగపూర్‌ కన్సార్టియంతో సైన్స్‌పార్కులో జరిగే వాణిజ్య సమావేశంలో పాలొంటారు. అనంతరం మంత్రి ఈశ్వరన్‌తో విందులో పాల్గొంటారాయన. తదుపరి అమరావతి నగర అభివృద్ధి -స్విన్‌ చాలెంజ్‌ పద్దతి అంశంపై చర్చలు జరుపుతారు. సోమవారం సాయ్తంరం సౌత్‌ ఆసియన్‌ స్టడీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎన్‌సిఎన్‌)లో ఆయన కీలక ఉపన్యాసం చేస్తారు. సింగపూర్‌లో భారత రాయభారి గోపీనాధ్‌ పిళ్లై సంధాన కర్తగా వ్యవహరిస్తారు. అనంతరం సింగపూర్‌ కన్సార్జియం విందులో పాల్గొంటారు. ఇదిలా ఉంటే మంగళవారం కూడ ఆయన పర్యటన కొనసాగుతుందని తెలిసింది. సింగపూర్‌లోని పలు టౌన్‌షిప్‌లను ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం సందర్శిస్తుందని, బుధవారం ఢిల్లీకి చేరుకుంటారని తెలిసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com