రజనీకాంత్ భాషా చిత్రం మళ్లీ థియేటర్లలో సందడి చేస్తూoది

- March 03, 2017 , by Maagulf
రజనీకాంత్ భాషా చిత్రం మళ్లీ థియేటర్లలో సందడి చేస్తూoది

''ఈ భాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు'' ఈ డైలాగ్ ఏ సినిమాలోనిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. రజనీకాంత్ హీరోగా నటించి, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన భాషా సినిమా 22 సంవత్సరాల తర్వాత మళ్లీ విడుదలవుతోంది. 1995లో విడుదలైన ఈ సినిమాను మళ్లీ విడుదల చేయడమేంటని ఆశ్చర్యపోకండి. డిజిటల్ ఫార్మాట్‌లో ఈ సినిమాను ఇవాళ రీ రిలీజ్ చేశారు. సినిమా మళ్లీ ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. రజనీకాంత్ సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా భాషా నిలిచింది. నగ్మా అందచందాలు, రఘువరన్ విలనిజం ఈ సినిమా స్థాయిని మరింత పెంచాయి. ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా తమిళ ప్రజలు ఎగబడి చూస్తారనడంలో అతిశయోక్తి లేదు.
తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆశ్చర్యకర విషయమేంటంటే ఇటీవల ఆస్పత్రిలో చేరిన డీఎంకే ప్రెసిడెంట్ ఎమ్ కరుణానిధి అడిగి మరీ భాషా సినిమాను చూశారట. కోలీవుడ్‌లో ఈ రీ రిలీజ్‌ వ్యవహారం కొత్తేమీ కాదు. గతంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్ సినిమాల్లో కొన్ని సినిమాలకు ఆధునిక హంగులు అద్ది మళ్లీ విడుదల చేసిన సందర్భాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com