వలసదారులకు డ్రైవింగ్‌ ఫీజ్‌?

- March 04, 2017 , by Maagulf
వలసదారులకు డ్రైవింగ్‌ ఫీజ్‌?

మనామా: ట్రాఫిక్‌ సమస్యల్ని కొంతవరకు తగ్గించడానికి వలసదారులైన డ్రైవర్లకు 100 బహ్రెయినీ దినార్ల రుసుము విధించాల్సిందిగా ఎంపీ ఒకరు ప్రతిపాదించారు. పార్లమెంటు సభ్యుడు జలాల్‌ కాదిమ్‌ దీనికి సంబంధించి పార్లమెంటరీ ప్రపోజల్‌ని సమర్పించడం జరిగింది. డ్రైవర్లకు, అలాగే వాహనాలకు ఫీజులు విధించడం ద్వారా ట్రాఫిక్‌ పరిస్థితులు మెరుగవుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. అలాగే వాహనాల రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లెర్నింగ్‌ లైసెన్సులు, డ్రైవింగ్‌ లైసెన్సుల ఫీజుల్ని డబుల్‌ చేయాల్సి ఉందని చెప్పారాయన. ఈ ఫీజుల ద్వారా సమకూరే ఆదాయాన్ని దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం వినియోగించవచ్చునని అభిప్రాయపడ్డారు ఎంపీ. జోర్డాన్‌, మలేసియాల్లో ఇలాంటి చట్టం ఒకటి ఉందని కూడా ఆయన గుర్తుచేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com