రవాణా సమయంలో గుండెపోటుతో మృతి చెందిన వలస భారతీయుడు

- March 06, 2017 , by Maagulf
రవాణా సమయంలో గుండెపోటుతో మృతి చెందిన వలస భారతీయుడు

సౌదీ అరేబియాలో ఒక నిర్వాసిత భారతీయుడు రవాణా సమయంలో  బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుండెపోటుతో మరణించాడు. గత శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో గురుసామి మూక్కన్, 49 సంవత్సరాల వయస్సు వ్యక్తికి హఠాత్తుగా గుండె ఆగిపోవడంతో మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.స్థానిక సామాజిక కార్యకర్త బషీర్ అంబాలాయి తెలిపిన సమాచారం మేరకు గురుసామి మూక్కన్ సౌదీ వీసా పునరుద్ధరించిన తరువాత రియాద్ నుండి గల్ఫ్ ఎయిర్ విమానం జి ఎఫ్ 068 ద్వారా భారతదేశం వెళ్లేందుకు ప్రయాణించే తన మార్గంలో ఈ మరణం సంభవించింది. భారతదేశం తమిళనాడు రాష్ట్రంలోని కొక్కడి  గ్రామంకు చెందిన గురుస్వామి శుక్రవారం తన ప్రయాణ సమయంలో భాగంగా విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ చేయించుతున్నప్పుడు తనకు  ఛాతీ నొప్పి వచ్చినట్లు భావించాడు. దీనితో ఆయనను మూహ్యాయరాక్ లో కింగ్ హేమాడ్  విశ్వవిద్యాలయం హాస్పిటల్ కు తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు.ఈ వ్యక్తి చనిపోయిన వార్త భారత రాయబార కార్యాలయంలో నమోదు అయ్యింది. లాంఛన కార్యక్రమాలు పూర్తయ్యాయి భౌతిక కాయాన్ని భారతదేశంకు తరలింపుబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com