పైనాపిల్‌ కోకోనట్‌ లడ్డు

- March 07, 2017 , by Maagulf
పైనాపిల్‌ కోకోనట్‌ లడ్డు

కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము - 1 కప్పు, తరిగిన పైనాపిల్‌ - 1 కప్పు, నెయ్యి - 30 మి.లీ, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - 1 కప్పు, యాలకుల పొడి - 1 టీస్పూను 
తయారీ విధానం: నెయ్యి వేడిచేసి తరిగిన పైనాపిల్‌ వేసి దోరగా వేగించాలి. వీటిని ప్లేట్‌లోకి తీసుకుని కొబ్బరి తురుము కూడా ఇలాగే వేగించుకోవాలి. ఈ రెండింటిని కడాయిలో వేసి కండెన్స్‌డ్‌ మిల్క్‌ పోసి చిన్న మంట మీద పాలు ఇగిరిపోయి ముద్దలా తయారయ్యేవరకూ ఉడికించాలి. యాలకుల పొడి వేసి కలిపి లడ్డూల్లా కట్టాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com