మళ్లీ 'కిస్ ఆఫ్ లవ్' ఆందోళనకు రంగం సిద్ధం
- March 09, 2017
కేరళలో మరోసారి 'కిస్ ఆఫ్ లవ్' ఆందోళనకు రంగం సిద్ధమైంది. మహిళా దినోత్సవం నాడు కొచ్చిలో జరిగిన మోరల్ పోలీసింగ్ ఘటనకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని స్వేచ్ఛావాదులు పిలుపునిచ్చారు. కొచ్చి మెరైన్ డ్రైవ్ మైదానంలో గురువారం సాయంత్రం 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. యువ జంటలపై శివసేన కార్యకర్తలు చేసిన దాడులకు నిరసనగా ఈ ఆందోళనకు దిగుతున్నట్టు ప్రకటించారు. మెరైన్ డ్రైవ్ మైదానానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కోజికోడ్ లోని ఓ హోటల్ లో భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు చేసిన దాడులకు వ్యతిరేకంగా 2014లో 'కిస్ ఆఫ్ లవ్' నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.
కాగా, కొచ్చి మోరల్ పోలీసింగ్ ఘటనలో కొచ్చి సెంట్రల్ సబ్-ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేశారు. ఎనిమిది మంది పోలీసులను ఆర్మెడ్ రిజర్వుడు పోలీసు క్యాంపుకు బదిలీ చేశారు. మోరల్ పోలీసింగ్ ఘటనను కొచ్చి మేయర్ సౌమిని జైన్ ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
తాజా వార్తలు
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!
- అల్-సబాహియాలో లూనా పార్క్ ప్రారంభం..!!
- షినాస్ తీరంలో డ్రగ్స్ కలకలం..ఇద్దరు అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన సౌదీ సహా 14 దేశాలు..!!
- షార్జాలో కొత్త ట్రాఫిక్ లా.. నవంబర్ 1 నుండి అమలు..!!
- ఖతార్లో ఇండియన్ పాస్ పోర్ట్ కోసం న్యూ గైడ్ లైన్స్ జారీ..!!
- దుబాయ్: ప్రవాసాంధ్రులతో రేపు సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్
- ప్రయాణికులకు RTC ఆత్మీయ స్వాగతం!
- అబుదాబీ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీల్లో సీఎం చంద్రబాబు
- ఏపీ మీదుగా రెండు హై స్పీడ్ రైలు







