'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 18న
- March 13, 2017
పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. మిగిలివున్న రెండు పాటల కోసం యూరప్‌కు వెళ్లిన చిత్రబృందం అక్కడ వాటి చిత్రీకరణను పూర్తిచేసింది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. మరోపక్క నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఒక పాట తర్వాత మరొక పాటను విడుదల చేస్తున్న చిత్రబృందం ఆదివారం సాయంత్రం మూడోపాటను విడుదలచేసింది. వీటన్నింటికీ విశేషమైన ఆదరణ లభించిందని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ నెల 18న ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు, సినిమాను ఇదేనెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కిషోర్‌కుమార్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో నార్త్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్‌మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ నాయికగా నటిస్తుండగా, ఇతర పాత్రల్లో శివబాలాజీ, కమల్ కామరాజు, అజయ్, అలీ, నాజర్, రావు రమేష్, వేణుమాధవ్, తరుణ్ అరోరా, చైతన్యకృష్ణ, మణికంఠ తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: గౌతంరాజు.
తాజా వార్తలు
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!







