ఆంక్షలు ఎత్తివేత నగదు విత్‌డ్రాలపై

- March 13, 2017 , by Maagulf
ఆంక్షలు ఎత్తివేత నగదు విత్‌డ్రాలపై

బ్యాంకులు, ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణపై ఆంక్షలు సోమవారం నుంచి నిలిచిపోనున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ఫిబ్రవరి 8న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం... ఈ రోజు నుంచి విత్‌డ్రాలపై అన్ని ఆంక్షలు ఎత్తివేస్తారు. గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒక్కసారిగా దేశ ఆర్ధిక వ్యవస్థలో కరెన్సీ కొరత నెలకొంది. దీంతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద కరెన్సీ ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు నగదు ఉపసంహరణపై ఆర్బీఐ పలు పరిమితులు విధించింది. విడతల వారీగా వీటిని ఎత్తివేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 28న సేవింగ్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ పరిమితిని వారానికి రూ.24 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించింది.
కాగా తాజాగా విత్‌డ్రాపై అన్ని ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.. నగదు లేక ఏటీఎంలు వెక్కిరిస్తుండడంతో వినియోగదారులకు సాంత్వన దొరికినట్టుకగా కనిపించడం లేదు. హైదరాబాద్ సహా పలు చోట్ల గత కొద్దిరోజులుగా నగదు అందబాటులో లేకపోవడంతో ఖాతా దారులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com