స్కూల్ లోనే ఆద్య పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసిన పవన్ రేణు లు
- March 24, 2017పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రేణు దేశాయ్ లు కొంత కాలం సహజీవనం చేసి అనంతరం పెళ్లి చేసుకొన్నారు.. ఈ దంపతుల సంతానం అకిరానందన్, ఆద్య లు.. కాగా పవన్ రేణు దంపతులు విడాకులు తీసుకొన్న నేపద్యంలో రేణు అకీరా, ఆద్యాలతో పాటు పుణె లో నివాసం ఉంటుంది.. కాగా పవన్ కళ్యాణ్ తండ్రిగా పిల్లాల విషయం లో ఎప్పుడు బాధ్యతగా ఉంటాడు అని రేణు దేశాయ్ పలు మార్లు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది.. కాగా ఆద్య 2010 మార్చి 23 న జన్మించినది.. ఈ నేపద్యంలో గురువారం (మార్చి 23) న పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్య పుట్టిన రోజు వేడుకలను రేణు దేశాయ్ తో కలిపి ఆద్య స్కూల్ లో సెలబ్రేట్ చేశాడు... అక్కడ ఆద్య రేణు లతో పాటు పిల్లలతో కలిసి పవన్ కళ్యాణ్ నవ్వుతూ ఉత్సాహంగా ఉన్నాడు.. తండ్రిగా తన పిల్లల విషయంలో బాధ్యతను పవన్ నిర్వహించడం లో ఎప్పుడు నిర్లక్షంగా ఉండడు అని రేణు చెప్పిన మాటలు పవన్ ఈ వేడుకల ఫోటోలను చూసిన వారికి అర్ధం అవుతుంది.. ఆద్య తన తండ్రి మీద ఒక చేతిని.. ఒక చేతిని తల్లి మీద వేసి తనకు తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చూపిస్తున్నట్లు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కాగా పవన్ కల్యాన్ తాజా సినిమా కాటమరాయుడు సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొన్నది.. గత కొన్ని నెలలుగా పవన్ ఇటు రాజకీయంగా.. అటు సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు.. నిన్న కూతురు పుట్టిన రోజు వేడుకల్లో ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయ్యినట్లున్నాడు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు