మానసికం
- October 01, 2015
నా కన్నులు నీ రూపాన్ని
నా హ్రుదిలోకి పంపే క్షణాన
మదిలోని భావ జాల ఊట
నా మనసును తడిపేస్తుంది
నువ్వు ప్రక్కనుండి వెళుతూ
ఉన్నప్పుడు,నా మేను చిరు
చెమట తో ప్రకంపనలు చెంది
పులకించి పోతుంది
పూల సౌరభాలు వెదజల్లు
నిన్ను శ్వాసించి,
అప్పుడు మన స్పందన రసాయినికమా
మరి ఇప్పుడు,నేను రాలేనని రానని
అలాగే నన్ను కవ్వించ నీవూ.. రాలేవని,
నీకు నాకు మధ్య,భాద్యతలు
బరువులు పెరిగాయని
అప్పటి లా మనం కలిసి దగ్గరగా
సహజీవనం చేయ లేమని
తెలిసినా ఎందుకు ఇంకా మనకు
ఈ ఆరాటాలు
ఇంకను ప్రేమ కుసుమక్షరాలు ఒకరిపై
ఒకరం చల్లుకోవాలని చూడటం ఎందుకు?
అయినా ఎప్పుడో,మన పెద్దలు చెప్పారుగా
ప్రేమ శారీరకం,రసాయినికం అయినా
అది మానసికం కూడా అని
ఎవరేమనుకున్నా
మనం మనలాగే
నిజమైన మానసికంగానే
కాపురముందాం.
--బోడ జయ రెడ్డి(అబుధాబి)
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







