25 దేశాల్లో వికలాంగుడి ప్రయాణం
- October 02, 2015
బలమైన సంకల్పం ముందు ఎలాంటి వైకల్యమైనా తలొంచుకోవాల్సిందేననడానికి బెంగళూరుకి చెందిన 55 ఏళ్ళ వికలాంగుడు నారాయణ ఉదాహరణగా నిలుస్తాడు. నివారించగల వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 25 దేశాల్లో పర్యటించాలనే లక్ష్యం పెట్టుకున్నాడు నారాయణ. గతంలో నారాయణ 19నెలల పాటు కష్టపడి 59 దేశాల్లో పర్యటించాడు. అదీ సైకిల్ మీద. ఆరు నెలల్లో 35 వేల కిలోమీటర్లు ప్రయాణించాలనే లక్ష్యం పెట్టుకున్నాడు నారాయణ. ఓ యాక్సిడెంట్లో వికలాంగుడిగా మారిన తాను, ఇకపై ఎవరూ తనలా వికలాంగులు కాకుండా ఉండేందుకు అవగాహన కల్పించాలనుకున్నాడట. వివిధ భాషల్లో బ్యానర్లను రూపొందించి వాటిని తన ప్రయాణంలో ప్రదర్శించనున్నాడు. పోలియో పట్ల అవగాహన పెంచడం, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియజేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి తెలియజెప్పడం, చిన్న వయసులో పెళ్ళిళ్ళ వల్ల వచ్చే ఇబ్బందుల గురించి వివరించడం ఈ యాత్రలో ముఖ్య ఉద్దేశ్యాలు. దుబాయ్ మరియు నార్తరన్ ఎమిరేట్స్ కాన్సులేట్ జనరల్ అనురాగ్ భూషణ్, నారాయణ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







