మటర్ పన్నీర్
- October 03, 2015
కావాల్సిన పదార్థాలు:
సన్నగా తరిగిన ఉల్లిపాయలు: ఒక కప్పు
బాగా పండిన టొమాటో ముక్కలు:1 1/4
జీడిపప్పులు- 8 నుంచి 10 , పచ్చిమిర్చి-1
మటర్ పన్నీర్ గ్రేవీ తయారుచేయాలంటే:
ఒకటి లేదా 1.5 టేబుల్ స్పూను వెన్న, ఒకటిన్నర టీస్పూను అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిబటానీలు 1/2 కప్పు, పన్నీరు/జున్ను (చీజ్) ఒకటిన్నర కప్పు, ఏలకులు 2, జీలకర్ర 1/2 టీస్పూను, ఒకటి రెండు తులసి ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు-2, అర స్పూను నుంచి 3/4 టీస్పూను కాశ్మీరి ఎర్ర మిరప్పొడి, 3/4 వంతు లేదా ఒక టీస్పూను గరమ్‌మసాలా, ఉప్పు-సరిపడినంత, కసూరి మెంతి, సన్నగా తరిగిన కొత్తిమీర పావు టీస్పూను.
తయారుచేయి విధానం:
ఉల్లిపాయముక్కలు, టొమాటోముక్కలు, జీడిపప్పులు, పచ్చిమిరపకాయల్ని కలిపి మెత్తగా పేస్టులా చేయాలి. కావాలనుకుంటే కొద్ది నూనెలో పన్నీర్‌ని దోరగా వేగించి దాన్ని వేడినీళ్లల్లో వేసి పక్కనపెట్టుకోవాలి. మూకుడులో కొద్దిగా నూనె వేసి అందులో జీలకర్ర, ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, తులసాకు వేసి సన్నని సెగ మీద ఒకటి రెండు నిమిషాలపాటు వేగించాలి. అలాగే అల్లంవెల్లుల్లి పేస్టును కూడా పచ్చివాసన పోయేవరకూ వేగించాలి. ఉల్లిపాయలు, జీడిపప్పులు, టొమాటోలతో మెత్తగా చేసిపెట్టుకున్న పేస్టును దాంట్లో వేసి దగ్గరపడేవరకూ వేగించాలి. ఆ మిశ్రమానికి కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు కలిపి పొయ్యి మీద రెండు నిమిషాలపాటు వేగించాలి. ఆ తర్వాత దీంట్లో పచ్చిబటానీలతో బాటు 1.5 కప్పుల నీరు పోసి బటానీలు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. అది చిక్కగా అయిన తర్వాత పన్నీరు, కసూరి మెంతి అందులో వేసి రెండు మూడు నిమిషాలపాటు పొయ్యిమీద ఉంచాలి. మీ అభిరుచిని బట్టి ఇందులో క్రీమ్ కూడా కలుపుకోవచ్చు. చిన్న గిన్నెలో క్రీమ్‌పోసి దానికి కొద్దిగా గ్రేవీ జోడించి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కూరలో వేసి బాగా కలపాలి. ఆతర్వాత పొయ్యి మీద నుంచి మూకుడును దించాలి. ఇలా రెడీ అయిన మటర్ పన్నీర్ మీద ముందరే సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీరను చల్లాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ మటర్ పన్నీర్ రెడీ. ఇక ఆరగించడమే తరువాయి.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







